ఆదివారం అమావాస్య రోజు శ్రీరామ కొండ జాతర....
ఆదివారం అమావాస్య రోజు శ్రీరామ కొండ జాతర ఎమ్మెల్యే కృషి వల్లనే రామ కొండ అభివృద్ధి కోయిలకొండ మండలం లో ఉన్న శ్రీ రామ కొండ క్షేత్రం పైన వెలిసిన శ్రీరామ పాదాన్ని దర్చించుకోవడానికి ఆదివారం అమావాస్య వచ్చిందంటే భక్తులతో కిటకిటలాడుతుంది. పూర్వకాలం నుంచి ఆదివారం అమావాస్య వచ్చిందంటే క్షేత్రం పైన జోరుగా జాతర కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి కోనే రూ లో స్నానం చేసి శ్రీరామ పాదాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. క్షేత్రం పైన వెలిసిన ఔషధం మూలికలతో కలిగిన చెట్లను భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఔషధ వనమూలికలు చెట్లను వెంట తీసుకుని వెళతారు . ఆదివారం అమావాస్య రోజు శ్రీరాముని పాదాన్ని దర్శించుకుంటే సకల పాపాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎమ్మెల్యే కృషి వల్లనే రామకొండ అభివృద్ధి.... నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కృషి వల్లనే రామ కొండ అభివృద్ధి దశలో ముందుకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రం దిగువ నుంచి పై వరకు రోడ్డు వేయడం జరిగింది. త్రాగునీటి వసతి,, భక్తులకు అన్ని వసతులు క్షేత్రం పైన అందుబాటులో ఉన్నాయి.