అడ్డాకుల మండలం లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల.....
అడ్డాకుల మండలం లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల.....అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో శనివారం రోజు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వర్యులు వి.శ్రీనివాస్ గౌడ్ , దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు రాచాల గ్రామ సమీప వాగులో నూతనంగా నిర్మిస్తున్న 5 కోట్ల 95 లక్షల నిధులతో కూడిన చెక్ డ్యామ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు, రాచాల గ్రామంలో సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు,తదనంతరం నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో రాచాల గ్రామ సర్పంచ్ తిరుపతయ్య ,అడ్డాకుల ఎంపీపీ నాగార్జున రెడ్డి, జడ్పిటిసి యన్,రాజశేఖర్ రెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ రాధిక ,జిల్లా మాజీ కో-ఆప్షన్ మహమూద్ ,మండల అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి ,అడ్డాకుల ఎంపిటిసి రంగన్న గౌడ్ ,మండల రైతుబంధు అధ్యక్షులు తిరుపతిరెడ్డి, గ్రామ రైతు బంధు అధ్యక్షులు చక్రపాణి రెడ్డి ,రవి, ప్రచార కార్యదర్శి జాజుల రాజేశ్వర్ రెడ్డి, కందూర్ రమేష్ గౌడ్ , మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు