చెట్లు, అడవుల పెంపకం మానవాళి పురోభివృద్ధికి సోపానం..

చెట్లు, అడవుల పెంపకం మానవాళి పురోభివృద్ధికి సోపానం....
* అడవులు పునరుద్ధరింప తగినవి.*
* అడవులను భూమి యొక్క ఊపిరితిత్తులతో పోలుస్తారు*
* చెట్లను నరకడం ద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది*
 మానవుని జీవితంలో లో చెట్లు మొక్కలు భాగస్వామ్యం అయ్యాయి. జీవ జాతి కి కావలసిన ఆహార పదార్థాలు మరియు ప్రాణవాయువును విడుదల చేయడంలో మొక్కల పాత్ర ఎంతో కీలకం. మొక్కలు ఆవరణంలోని విషపూరిత వాయువుల ను తీసుకొని వాతావరణంలో  వేడిని తగ్గించి 21 శాతం ఆక్సిజన్ ను వాతావరణంలో ఉండేటట్లు చూస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించబడును. 2012 నవంబర్ 28న యునెస్కో వారిచే ఆవిష్కరింపబడిన ప్రపంచ అటవీ దినోత్సవం 2013 మార్చి 21న మొదటిసారిగా ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించబడినది. ప్రస్తుతం ముందు తరాల వారికి అడవులు వాటి ప్రాముఖ్యత ప్రయోజనాలను గురించి తెలియజేయడం కోసం అటవీ దినోత్సవం రోజున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 1971 నవంబర్ లో ఆహార, వ్యవసాయ సంస్థ యొక్క స్టేట్ సభ్యులు జరిపిన 16వ సమావేశంలో ప్రతి సంవత్సరం మార్చి 21 న ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటారు .చెట్లు నాటడం ,చెట్ల పెంపకం పై అవగాహన కల్పిస్తారు .2014లో నా అడవి -నా జీవితం అనే కార్యక్రమం నిర్వహించారు. 2015 వ సంవత్సరంలో అడవులు వాతావరణం మార్పు అనే పద్యంలో ప్రచారం చేశారు. 2017లో అడవులు శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు .2018 సంవత్సరంలో ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ సిటీస్ నేపథ్యంతో ప్రచారం చేశారు .2021 అంతర్జాతీయ అటవీ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అటవీ పునరుద్ధరణ, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థల రక్షణ మరియు పునరుజ్జీవనం కోసం పిలుపునిచ్చిన యునైటెడ్ నేషన్స్ ఆన్ సిస్టం. ప్రపంచ వ్యాప్తంగా జీవవైవిధ్యంలో 80 శాతం అడవులు 60000 చెట్ల జాతులు ఉన్నాయి .సుమారు 1.6 బిలియన్ ప్రజలు ఆహారం ,ఆశ్రమము ,శక్తి ,మందులు మరియు ఆదాయం కోసం నేరుగా అడవులపై ఆధారపడ్డారు.మహబూబ్ నగర్ జిల్లా అటవీ అధికారి సిహెచ్ రంగారెడ్డి అభిప్రాయం: ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటికి నీరు పోసి సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. అడవులను పెంచడం, సంరక్షించడంలో అటవీ సిబ్బందికి సహకరించాలి. చెట్లను నరికి వేయడం ద్వారా వాతావరణంలో పెను మార్పులు సంభవించి వర్షపాతం తక్కువగా నమోదవుతుందని అన్నారు .అడవిలో ఉండే జీవజాతుల మనుగడకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని అన్నారు.