అడ్డాకల్లో ఇంటింటి సర్వే....
అడ్డాకల్లో ఇంటింటి సర్వే....
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా అడ్డాకుల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సర్వే నిర్వహించారు గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ గ్రామ కార్యదర్శి ఎవరికైనా జ్వరము ,జలుబు ,దగ్గు తో బాధపడుతూ ఉంటే వాళ్ళకు ఇంటి దగ్గరే కావలసిన మందులు ఇవ్వడం జరుగుతుందని మైకు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు సర్వేలో ప్రజలకు వ్యాక్సినేషన్ మరియు కరోనా గురించి అవగాహన కల్పించారు. ఇప్పటివరకు రెండు టీములుగా ఏర్పడి 453 ఇండ్ల ను సర్వే చేయడం జరిగిందని, ఇందులో 30 మందికి జలుబు దగ్గు జ్వరం వున్నట్లు గుర్తించడం జరిగిందని.. 30 మందికి కావలసిన మెడిసిన్ కిట్లు అందించమని గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి విఆర్వో ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు