అభివృద్ధి, సంక్షేమం తెరాసతోనే సాధ్యం: జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి....
అభివృద్ధి, సంక్షేమం తెరాసతోనే సాధ్యం: జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి.... జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఏరియా, గౌరి శంకర్ కాలనీ లో పర్యటించిన ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం తెరాసతోనే సాధ్యమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఏరియా, గౌరి శంకర్ కాలనీ లో ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ బాగులేక పోవడంతో వెంటనే నూతన డ్రైనేజీ నిర్మాణానికి పనులను ప్రారంభించాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. చిన్న చిన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారింపచేయాలని అన్నారు. కాలనిలో కల్కి భగవాన్ సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాలివేంద్రని ప్రారంభించారు. అనంతరం బాదేపల్లి చంద్ర ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యకర్తల సమావేశం లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ నెల 14 తేదీన జడ్చర్ల పట్టణంలో కేటిఆర్ గారి పర్యటన సందర్భంగా బాదేపల్లి మార్కెట్ యార్డు లో జరుపదలచిన సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు అన్నారు.