అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను ముందు వరుసలో నిలబెట్టాలి ... జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ...
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను ముందు వరుసలో నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు జిల్లా అధికారులను ఆదేశించారు.
కరోనా లాక్ డౌన్ కారణంగా పనుల పురోగతి మందగించిందని, అందువల్ల ఇకపై ప్రభుత్వ ప్రాధాన్య పథకాలన్నింటినీ వేగవంతం చేయాలని చెప్పారు.
బుధవారం రాత్రి ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ నెల 11 నుండి లాక్ డౌన్ కేవలం సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకే పాక్షికంగా ఉంటున్నందున ఇంజనీరింగ్ శాఖలు, ఇతర సంక్షేమ శాఖల ద్వారా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని చెప్పారు ఈనెల 15 నుండి రైతుబంధు నిధులను రైతులకు పంపిణీ చేయనున్న దృష్ట్యా బ్యాంకులలో పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రైతుబంధు పంపిణీ కి ప్రత్యేక అధికారులకు కొన్ని మండలాలను ఇన్చార్జిలుగా కేటాయించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. తప్పనిసరిగా బ్యాంకు లో కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నది లేనిది పరిశీలించాలని , ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రేషన్ కార్డు దారులకు మే,జూన్, జూలై నెలలకు సంబంధించి ఒక మనిషికి 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన దృష్ట్యా ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ఇది దీపావళి వరకు కొనసాగుతున్నందున దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. అలాగే వ్యవసాయ, మత్స్య, తదితర శాఖల ద్వారా చేపట్టిన పనులపై కూడా సంబంధిత అధికారులు దృష్టి సారించాలని చెప్పారు . వచ్చే సోమవారం నుండి శాఖల సమ్మిళిత సమావేశాలు నిర్వహించి ప్రతి రోజు 2 లేదా 3 ప్రాధాన్య పథకాలపై సమీక్షిస్తానన్నారు. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలను కరోనా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 441 గ్రామపంచాయతీలు ,మూడు మున్సిపల్ వార్డులలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిండం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా గడచిన 5 రోజుల నుండి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాని గ్రామాలు75 ఉన్నాయని, అదేవిధంగా గడిచిన 10 రోజులలో ఒక్క కేసు కూడా నమోదు కానీ గ్రామాలు 61 ఉండగా, గడచిన 15 రోజులలో ఒక్క కేసుకుడా నమోదు కానీ గ్రామాలు 72 ఉన్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు ,జిల్లా రెవెన్యూ అధికారి కే. స్వర్ణలత, జిల్లా అధికారులు హాజరయ్యారు .