ఆటల వల్ల సంపూర్ణ ఆరోగ్యం...ఆటలలో గెలుపు ఓటములు సహజం ...

ఆటల వల్ల సంపూర్ణ ఆరోగ్యం...ఆటలలో గెలుపు ఓటములు సహజం ...జెడ్పిటిసి మాచారం శ్రీనివాస్ రెడ్డి  గండీడ్  ఆటల తో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జెడ్ పి టి సిమాచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మండలంలోని కొమిరెడ్డి పల్లి గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ ట వర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలో గెలుపు ఓటములు సహజమని గెలుపు ఓటమి ని సమానంగా స్వీకరించాలని అప్పుడే అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామని ఓడిపోయిన వారు కుంగిపోకూడదు మళ్లీ గెలిచేందుకు పునాది బాటలు వేసుకోవాలన్నారు  అలాగే మొదటి బహుమతి కోస్గి జట్టుకు 25 వేల రూపాయలను పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి , కొమిరెడ్డి పల్లి జట్టుకు రెండో బహుమతి  12,500 ఎంపీపి మాధవి,  వైస్ ఎంపీపీఈశ్వర్ గౌడ్  లు అందజేశారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,  పిఎసీఏస్ డైరెక్టర్ జంగల్ల వెంకటయ్య ,బాల వర్ధన్ రెడ్డి, గోపాల్, తదితరులు పాల్గొన్నారు