ఆడబిడ్డ పెళ్లి కి అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్. - ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి..

  1. ఆడబిడ్డ పెళ్లి కి అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్. -  ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి..జడ్చర్ల చంద్ర గార్డెన్స్ లో 113 మంది లబ్ధిదారులకు  ₹ 1,13,13,108 రూపాయల  కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ.సర్పంచ్ లకు గౌరవ వేతనం30% పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు జిల్లా సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి సన్మానం.తెలంగాణ ప్రభుత్వం పెద్దింటి ఆడపిల్లల పెళ్లికి అండగా నిలుస్తుందని వారి ఇండ్లలో జరిగే వివాహాది శుభకార్యాలకు కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ ద్వారా డబ్బులు అందచేస్తునమ్మని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి  అన్నారు. జడ్చర్ల చంద్ర గార్డెన్స్ లో ఈ రోజు 113 మంది లబ్ధిదారులకు ₹ 1,13,13,108 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి  అందజేశారు. కరోనా సంక్షోభంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారిదే అని, నిరుపేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిఅన్నారు. అంతకుముందు తెలంగాణ రాష్టంలో సర్పంచ్ లకు గౌరవ వేతనం 30% పెంచడం పట్ల జిల్లా సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని సన్మానించారు.