ఆడబిడ్డల పెళ్లిళ్లకు శాసనసభ్యుల సహాయం ....

ఆడబిడ్డల పెళ్లిళ్లకు శాసనసభ్యుల సహాయం ....
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు 
తెలంగాణ ఉద్యమం సమయంలో బాలానగర్ మండలంలో మహిళలను చైతన్య పరిచి ఉద్యమంలో పాల్గొనేటట్లు చేసిన  టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మాధవి, శోభ  కుటుంబాల వివాహాలకు జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా ఒక్కో పెళ్లి కుమార్తెకు 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని  స్థానిక వైస్ ఎంపీపీ వడ్ల  వెంకటాచారి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరుల చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఎస్సీ కాలనీలో శోభా రాణి కూతురు వివాహం కోసం 15000 వేల రూపాయలు, టిఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు మాధవి చెల్లెలు సద్గుణ వివాహం కోసం మరో 15000 వేల రూపాయలను అందజేయడం పట్ల ఆయా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, ఆచారి, నర్సింలు,  వార్డు సభ్యులు అఫ్సర్ ఖాన్, దాసరి చిన్న, దినేష్, శివ కుమార్, కే రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.