వెబెక్స్ ద్వారా జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం-జెడ్ పి సి ఈ ఓ జ్యోతి

 వెబెక్స్ ద్వారా జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం-జెడ్ పి సి ఈ ఓ జ్యోతి

         కరోన దృష్ట్యా ఈ నెల 5 న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వెబెక్స్ ( ఆన్ లైన్)  ద్వారా నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు.
     ముందుగా నిర్ణయించిన ప్రకారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ప్రత్యక్షంగా నిర్వహించాలని  అనుకున్నప్పటికి కోవిడ్ దృష్ట్యా వెబెక్స్ (ఆన్లైన్ )ద్వారా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
       అందువల్ల జిల్లా పరిషత్ గౌరవ సభ్యులు ,సంబంధిత జిల్లా అధికారులు 5 వ తేదీ ఉదయం 10.30 గంటలకు జిల్లా పరిషత్ కు రాకుండా వారు ఉన్న చోటునుండే  (ఆన్లైన్ )  వేబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి హాజరు కావాలని ఆమె కోరారు. వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించిన లింకు వివరాలను  వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియ చేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.