వైయస్సార్ సేవలు మరువలేనివి
వైయస్సార్ సేవలు మరువలేనివి - డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్ల కొత్వాల్ - దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని డిసిసి అధ్యక్షుడు ఉబేదుల్ల కొత్వాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్ వర్ధంతి నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్వాల్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారు అని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు . జిల్లాలో భారీ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుంది అని అన్నారు. ఆయన ఏ పథకాన్ని ప్రవేశపెట్టిన జిల్లా నుంచి ప్రారంభించేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కోఆర్డినేటర్ ఫక్రుద్దీన్, నాయకులు చంద్ర కుమార్ గౌడ్, np వెంకటేష్ సంజీవ్ ముదిరాజ్ , cj బెనహర్ ,లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ ఖాద్రీ , నరసింహారెడ్డి, లింగం నాయక్, చంద్రశేఖర్, సాయి బాబా, కిషన్ నాయక్, రాములు యాదవ్, ఫాయాజ్, హక్, తహెర్ తదితరులు పాల్గొన్నారు.