ప్రతి శుక్రవారం మొక్కలకు నీరు...
తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి శుక్రవారం మొక్కలకు నీరు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నే జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మొక్కలు నాటిన అన్ని సైట్లలోని మొక్కలకు ప్రతి శుక్రవారం నీరు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అందరు అధికారులు, అన్ని కార్యాలయాలు, అదేవిధంగా మొక్కలు పెంచే సైట్లలో మొక్కలకు నీరు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ శుక్రవారం మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణ లో నాటిన మొక్కలకు ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ పుట్ట శ్రీనివాస్ స్వయంగా మొక్కలకు నీరు పెట్టారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్ ను అభినందించారు.