ఉపాధ్యాయుల పాత్ర గురుతరమైనది -డిఈఓ ఎ. ఉషారాణి
ఉపాధ్యాయుల పాత్ర గురుతరమైనది
-డిఈఓ ఎ. ఉషారాణి
-పాలమూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
- 11 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానం
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురుతరమైన మైనదని మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి అన్నారు. పాలమూరు లయన్స్ ఆధ్వర్యంలో బుధవారం మహబూబ్ నగర్ లోని మోడ్రన్ హై స్కూల్ లో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రత్న డా:సర్వే పల్లి రాధా కృష్ణన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి గురుపూజోత్సవ వేడుకలు ప్రారంభించారు. అనంతరం పాలమూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కె.ప్రతాప్ రెడ్డి అధ్యక్షత న జరిగిన సభలో డిఇఓ ఉషారాణి మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు పునరంకితమై పని చేయాలని పిలుపునిచ్చారు. అంకితభావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. ప్రధాన వక్తగా హాజరైన విశ్రాంత అధ్యాపకులు ఎస్.జగపతి రావు మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని అన్నారు. లయన్స్ ఫాస్ట్ డీస్ట్రిక్ట్ గవర్నర్, రెడ్ క్రాస్ చైర్మన్ డా:అంబటి నటరాజు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు అన్ని విధాలా చేయూత నిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త, పిఆర్టీ యు టీఎస్ రాష్ర్ట ఉపాధ్యక్షులు అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టత గురించి వివరించారు. అనంతరం డిఇఓ ఉషారాణి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి గోపాలకృష్ణ, ప్రోగ్రామ్ చైర్మన్ జి.రమణయ్య, కో- చైర్మన్ తిరుపతి రెడ్డి, జోన్ చైర్మన్ శ్రీనివాసులు, లయన్ శ్రీహరి, గాంధీ, వీరన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం
పాలమూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన 11 మంది ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు. వెంకటమ్మ (జి హెచ్ యం, జడ్పి హెచ్ ఎస్ శాఖ పూర్), మంజు లత (స్కూల్ అసిస్టెంట్ జడ్పి హెచ్ ఎస్ శాఖ పూర్), లక్ష్మీ నర్సింహ్మరాణి (స్కూల్ అసిస్టెంట్, జడ్పి హెచ్ ఎస్ బాలికల ,దేవరకద్ర), గట్టు మనోహర్ రెడ్డి, గ్రేడ్ -2 తెలుగు( ప్రభుత్వ ఉన్నత పాఠశాల మోమిన్ వాడి) , ఫాతిమా జీనత్( హిందీ ఉపాధ్యాయులు, యం జి హెచ్ ఎస్), మాధవి లత ( తెలుగు ఉపాధ్యాయులు, మోడ్రన్ హై స్కూల్) శ్రీనివాస్ గౌడ్( గ్రేడ్ -2 తెలుగు జడ్పి హెచ్ ఎస్ లక్ష్మీపల్లి) ఎస్ జి టి ఉపాధ్యాయులు రేవతి ( యూపీఎస్ మద్దిగట్ల), కె. యాదయ్య(పి.ఎస్.భూత్పూర్), జె.సుదర్శన్(పి.ఎస్.ఏనుగొండ) మల్లేష్ ( పి.ఎస్.దొర్రితాoడ) లకు డిఇఓ ఉషారాణి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు.