ఆన్ లైన్ విద్య విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
కరోనా నేపథ్యంలో విద్యార్థులు చదువుకు దూరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆన్ లైన్ విద్యా విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని దేవరకద్ర జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ హెచ్ యం చంద్రకళ అన్నారు. గురువారం దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆన్ లైన్ తరగతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.అనంతరం హెచ్ యం, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రోజు దూరదర్శన్, టి.శాట్ లలో ప్రసారమవుతున్న పాఠ్యoశాలు విద్యార్థులు విధిగా వినే విధంగా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యార్థులకు కలిగే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో హెచ్ యం చంద్రకళ మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షణ చేయాలని పిలుపునిచ్చారు. మానవళి మనుగడ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ యం జి.వెంకటేశ్వర్లు, ఉన్నత పాఠశాల ఇంచార్జి హెచ్ యం సల్వాచారి, ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్, రజియా బేగం తదితరులు పాల్గొన్నారు.