పాలమూరులో ఆగని ఇసుక మాఫియా

 పాలమూరులో ఆగని ఇసుక మాఫియా

యథేచ్ఛగా ఫిల్టర్ దందా....పట్టించుకొని అధికారులు

 15 ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా
 ఎస్పీ, కలెక్టర్ ఆదేశాలు.... బేఖాతరు
 బెదరని ఇసుక మాఫియా ....ఆగని అక్రమ దందా
 సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ 
 
      మహబూబ్ నగర్ జిల్లా & మండలంలోని తిమ్మసానిపల్లె గ్రామం ఎర్రవెల్లి తండా శివారులో గల చిక్కుడు వాగు నుండి గత కొంత కాలంగా ఇసుక మాఫియా ఇసుకను  అక్రమంగా రవాణా చేస్తున్న పట్టించుకొనే నాథుడే కరువయ్యారని, సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరులో ఇసుక మాఫియా మళ్ళీ రెచ్చిపోతుందని తాము గత కొంతకాలంగా రెవిన్యూ, పోలీస్, మైనింగ్ తదితర శాఖల అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న....సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటె, ఇసుక మాఫియాను అరికట్టాలని....పిడికెడు ఇసుకను కూడా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని....  జిల్లా కలెక్టర్  హెచ్చరికలు జారీ చేసి కనీసం నెల రోజులు గడుస్తున్నా..... ఇసుక మాఫియా మళ్ళీ రెచ్చిపోవడం గమనార్హం. జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లుతో కలసి గత నెల 28న (28-06-2021) జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్ లు, ఎస్ఐ లు, మైనింగ్ అధికారులతో కలెక్టర్ ఎస్. వెంకట్ రావ్ తన ఛాంబర్ లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మన ఇసుక.... మన వాహనంతోనే ఇసుకకు అనుమతులు ఉన్నాయని, దీనిని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసి నెల రోజులు గడుస్తున్నా, మళ్ళీ పాలమూరులో ఇసుక మాఫియా దర్జాగా 15 ట్రాకర్లతో శుక్రవారం ఉదయం.... పట్టపగలు 8.30 గంటలకు ఇసుకను అక్రమంగా తరలిస్తురని ఆయన తెలిపారు. ఇదిలాఉంటె ఒకవైపు..... ఇసుక మాఫియా చిక్కుడు వాగులో దర్జాగా జేసీబీతో ఇసుకను తోడి అక్రమంగా రవాణా చేస్తున్నా..... మరోవైపు ట్రాక్టర్లతో ఫిల్టర్ ఇసుకను తరలిస్తున్నా.....అటువైపు వెళ్లేందుకు రెవిన్యూ, పోలీస్, మైనింగ్, ఇతర సంబంధిత శాఖ అధికారులు సహసించక పోవడం చూస్తే.....ఇసుక మాఫియాపై వారికీ ఉన్న శ్రద్ధ ఏపాటిదో..... ప్రత్యేకించి చెప్పాలిసిన అవసరం లేకపోలేదు. ఇకనైనా సంబంధిత అధికారులు మొద్దు నిద్ర మేలుకొని..... ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటారో లేదో.... వేచిచూద్దాం.