కెజిబివి ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలి

కెజిబివి ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలి...

మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...

పీఆర్సీ అమలు చేయకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తాం
 
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్
 
తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ లో  పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు.
శుక్రవారం నాంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేసున్న ఉద్యోగులందరికి 30 శాతం పీఆర్సీ ఇచ్చిన రాష్ట ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం పీఆర్సీ ఇవ్వకుండా మొండిచేయి చూపటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.మొదటినుంచి కూడా కేసీఆర్ ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష చూపిస్తూనే వున్నదని, మొదటి కేబినెట్ లో మహిళా మంత్రి లేకుండానే పాలన సాగించారని, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు మహిళ కమిషన్ ఏర్పాటు చేయలేదని, ఇప్పుడేమో మహిళా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు.గురుకులాకు ధీటుగా కేజీబీవీలు నడుపుతున్నా కూడా వారి శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించక పోవటం దుర్మార్గమన్నారు.
మేమె పీఆర్సీ తెచ్చామని  గొప్పలు చెప్పుకుంటూ...కేసీఆర్ కు  పాలాభిషేకాలు చేసిన ఉద్యోగ సంఘాలు కేజీబీవీ ఉద్యోగులకు పీఆర్సీ ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు.
సభ్యత్వాలకు పోటీపడే సంఘాలు సమస్యలపై కూడా పోరాటం చేయాలన్నారు.
సీఎం కేసీఆర్ స్పందించి  కేజీబీవీ మరియు యుఆర్ఎస్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో మహిళా ఉద్యోగులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, నాయకులు శేఖర్ గౌడ్, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.