ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారికి తెలంగాణ మాలమహానాడు ఎప్పుడు మద్దతు

 ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారికి తెలంగాణ మాలమహానాడు ఎప్పుడు మద్దతుగా ఉంటుంది.

- బ్యాగరి వెంకటస్వామి రాష్ట్ర అధికార ప్రతినిధి
 
 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోపాయికారీ ఒప్పందంతో నిత్యావసరాల సరుకుల ధరల నుండి పెట్రోల్ డీజిల్ మరియు వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచేస్తూ ఆపై పన్ను రూపంలో ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి వెలుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం జరిగింది.
 తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి గారు ఈరోజు పాలమూరులోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్లలో అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, జిల్లా మీడియా సేల్ కన్వీనర్ బెనాహర్, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్ గార్లను పోలీసు స్టేషన్లలో కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతున్న మీకు మా తెలంగాణ మాలమహానాడు ఎల్లవేళలా మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా నేటి రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల రక్తం పీల్చి పిప్పి చేయడం కోసం ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వలేదని, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా పరిపాలన చేయడం చేతకాక పోతే వెంటనే దిగిపోవాలని, లేని పక్షంలో ప్రజలే తిరగబడి తరిమి కొడతారని హెచ్చరించారు.