తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి: బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు ..
తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం అన్నారు బిజెపి జిల్లా కార్యదర్శి ఎన్ రాజేశ్వర్
మిడ్జిల్ మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాజేశ్వర్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి హాజరై మాట్లాడుతూ తెలంగాణకు 1948లో రజాకార్ల నుండి విముక్తి కలిగినటువంటి ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో భారత సైన్యం తో కలిసి మన తెలంగాణ కు విముక్తి కలిగినటువంటి నాడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాకముందు గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేయాలని మన ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అప్పుడున్న ప్రభుత్వాలను నిలదీయడం జరిగింది కానీ అధికారంలోకి రాగానే ఎంఐఎం కబంధహస్తాల్లో బందీగా మరి ఎంతోమంది తెలంగాణ అమరవీరుల ఆశయాలను నీరు కారుస్తున్నారు కానీ మహారాష్ట్ర కర్ణాటకలో అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకునే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా సెప్టెంబర్ 17 ను నిర్వహిస్తా లేదో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా ఇచ్చిన మాటపై నిలబడి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించే బిజెపి పార్టీకి మద్దతిచ్చి గెలిపించుకుంటారాని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కుమార్ గౌడ్ వాసుదేవ్ విష్ణు బాయ్ రాములు వెంకట్ రెడ్డి రమేష్ గౌడ్ భాస్కర్ పట్నం జంగయ్య రాము అరవింద్ పర్వతాలు శేఖర్ గణేష్ చంద్రశేఖర్ యాదయ్య విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది