విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి ...ఎం పి డి ఓ శ్రీనివాస్ రెడ్డి

 విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

   - ఎం పి డి ఓ  శ్రీనివాస్ రెడ్డి
 
డ్రగ్స్ భూతాన్ని తరిమేద్దాం కరపత్రం విడుదల
 
యుక్త వయస్సులో ఉన్న విద్యార్థులు సమాజంలో జరుగుతున్న సంఘటనలను నిశితంగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎం పీ డీ ఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 
       శుక్రవారం చిన్న చింతకుంట మండలంలోని అప్పంపల్లి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ భూతాన్ని తరిమేద్దాం కరపత్రాన్ని విడుదల చేశారు. ఎం ఈ ఓ లక్ష్మణ్ సింగ్  జీ ఎచ్ ఎం రామకృష్ణ మాస్టర్ వాలంటీర్ గుముడాల చక్రవర్తి గౌడ్ మాట్లాడారు. విద్యార్థి దశలో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని భావి భారత పౌరులుగా ఎడగాల్సిన విద్యార్థులు యువకులు మత్తు పదార్థాలకు డ్రగ్స్ కు అలవాటు పడి ఉజ్వల భవిషత్తును పాడు చేసుకుంటుంన్నారని ఎం పీ డీ ఓ అన్నారు. ఎం ఈ ఓ లక్ష్మణ్ సింగ్ మాట్లాడుతూ నేరస్తులు బయటెక్కడో లేరని చుట్టుపక్కలే ఉంటారని తెలిపారు. అమ్మాయిలు మరింత అప్రమత్తoగా ఉండాలని  ఇబ్బందులు ఎదురైతే మొదట తల్లి దండ్రులకు పరిస్థితి చేయి దాటితే అధికారులకు తెలపాలని సూచించారు జి.హెచ్ యం రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఇతర చెడు అలవాట్లపై కాకుండా చదువుపైనే దృష్టిపెట్టాలని కోరారు.నషా ముక్త్ భారత్ మాస్టర్ వాలంటీర్ గుముడాల చక్రవర్తి గౌడ్ మాట్లాడుతూ డ్రగ్స్ సమస్య జాతి సమస్యగా మారిందన్నారు. ప్రజా చైతన్యం తోనే ఈ సమస్య పై పోరాడగలమన్నారు