శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల సాధారణ ఎన్నికలపై అవగాహన

 శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల సాధారణ ఎన్నికలపై అవగాహన...

 
మహబూబ్ నగర్ ... 
 
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య రైల్వే స్టేషన్ బ్రాంచు పాఠశాల ప్రాంగణంలో "విద్యార్థులకు సాధారణ ఎన్నికలపై మాక్ పోలింగ్" నిర్వహించి అవగాహన కల్పించారు.అందులో భాగంగా 5రోజుల క్రితం విద్యార్థిని, విద్యార్థులు హెడ్ బాయ్స్/ హెడ్ గర్ల్స్ డిప్యూటీ హెడ్ బాయ్స్ / డిప్యూటీ ఎడ్ గర్ల్స్ టూ బి విద్యార్థులు ఎలక్షన్ లో నామినేషన్ వేసి తమ గుర్తుల గురించి 6. 7వ తరగతి విద్యారులతో ఉపాధ్యాయులతో ప్రచారం చేశారు.శనివారం పాఠశాలలో ఎన్నికలు నిర్వహించారు. ఈ విధంగా ఎలక్షన్స్ నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఓటు యొక్క ప్రాధాన్యత తెలుస్తుందని ప్రిన్సిఫల్ శ్రీధర్ విద్యార్థులకు వివరించారు. అందులో భాగంగా ఏజీఎం భాస్కర్ రెడ్డి, కోఆర్డినేటర్ రఘుబాబు, ఫీన్సిపల్ శ్రీధర్, డీక్కావోష్, c బ్యాచ్ ఇన్ చార్జ్ నౌషిన్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకున్నారు.