పాఠశాలల పరిశుభ్రత అందరి బాధ్యత

 పాఠశాలల  పరిశుభ్రత అందరి బాధ్యత

- ఎస్ యం సి చైర్మన్ చిన్న కాశన్న 
పాఠశాలల పరిశుభ్రత ప్రతిఒక్కరిపై ఉందని దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల ఎస్ యం సి చైర్మన్ చిన్న కాశన్న అన్నారు. బుధవారం పాఠశాలలు పున:ప్రారంభమైన సందర్భంగా  కరోనా నేపథ్యంలో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా గ్రామానికి చెందిన యువకుడు, విద్యాభిమాని అమరేంధర్ రెడ్డి పాఠశాలకు శాని టైజర్ స్టాoడ్, 5 లీటర్ల శాని టైజర్ క్యాన్ ను ఉచితంగా బహు కరించారు.  ఈ సందర్భంగా  హెచ్ యం జి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి చైర్మన్ చిన్న కాశన్న  హాజరై మాట్లాడారు. పాఠశాల పరిశుభ్రతకు, విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు చేయూత నివ్వాలని కోరారు.  దాత అమరేంధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అనంతరం దాత అమరేంధర్ రెడ్డిని ఉపాధ్యాయులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పి,పీఎస్ పాఠశాలల హెచ్ యం లు విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్, బాసిద్,కల్పన,సల్వాచారి, శంకర్, శ్రీనివాస్ గౌడ్, రజియా బేగం, తదితరులు పాల్గొన్నారు.