ముసాపేట్ లో మళ్ళీ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
ముసాపేట్ లో మళ్ళీ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా...
5 వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా...
టాటా మొబైల్ ఇసుక వాహనం పోలీస్ స్టేషన్ కు తరలింపు...
కేసులు వద్దంటున్న మాఫియా.... పైరవీలు షురూ
అడ్డాకల్ పోలీసులపై ఒత్తిడి తెస్తున్న ఎమ్మెల్యే ఆల పాత గన్ మెన్...
ఇసుక మాఫియాను....అడ్డుకుంటాం
సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటాం..... మన ఇసుక మన వాహనం తప్ప....ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, ఎస్పీలు జారీ చేసిన ఆదేశాలు నీటిమీద రాతలుగానే మిగిలిపోతున్నయీ. గత మూడు నెలల క్రితం తేదీ. 28-06-2021న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లుతో కలసి జిల్లాలోని అందరు తహసీల్దార్, ఎస్ఐలు, మైనింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ.... పిడికెడు.... ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినా ఆదరని....బెదరని ఇసుక మాఫియా....జిల్లా కలెక్టర్, ఎస్పీల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ముసాపేట్ మండలంలో గత కొంత కాలంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట్ మండలంలో ఇసుక మాఫియా మళ్ళీ రెచ్చిపోతుంది. ఇసుక మాఫియాకు ఒకవైపు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అటువైపు రెవిన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు వెళ్లేందుకు జంకుతున్నారు. దింతో ఇసుక మాఫియా 3 మినీ డిసిఎంలు .....6 భారత్ బెంజ్ లు అన్న చందంగా ముసాపేట్ మండలంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాను కొనసాగిస్తుంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి......మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట్ మండలంలో ఇసుక మాఫియా మళ్లీ, మళ్ళీ రెచ్చిపోతున్న....అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవిన్యూ, పోలీసులు అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా, తాపీగా చోద్యం చూస్తున్నారు. గతంలో ఇసుక మాఫియాకు స్థానిక పోలీసులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అంతేకాకుండా గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఎస్ఐ ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తున్నదనే నేపధ్యంలో ఆయనను అక్కడి నుండి తొలగించి, పక్క జిల్లాకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె గురువారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు మండల పరిధిలోని కొమ్మిరెడ్డిపల్లి వాగు నుండి ఇసుకను 5 వాహనాల్లో (౩ మినీ డిసిఎంలు, 2 టాటా మొబైల్) ఇసుక మాఫియా అక్రమంగా తరలించారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, 4 వాహనాలు తప్పించుకు పారిపోగా.... ఒక టాటా మొబైల్ AP 22 X 3278 వాహనం కొమ్మిరెడ్డిపల్లి వాగు నుండి పొన్నాకల్ బిడ్జి దాటి నందిపేటకు ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని అడ్డాకల్ పోలీస్ స్టేషన్ తరలించారు.
అడ్డాకల్ పోలీసులపై ఒత్తిడి తెస్తున్న ఎమ్మెల్యే ఆల పాత గన్ మెన్
ఇదిలాఉంటె కేసు వద్దంటూ ఇసుక మాఫియా.... పైరవీలు షురూ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులు నమోదు చేయొద్దంటూ....అడ్డాకల్ పోలీసులపై స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో గతంలో గన్ మెన్ గా పనిచేసిన ఓ పోలీస్ ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలాఉంటె సదరు వాహనం సీజ్ చెయ్యొద్దని.... కేవలం తహసీల్దార్ కు మాత్రమే కేసు రాసి పంపాలని....పంపితే కేవలం డబ్బులు కట్టి సదరు వాహనాన్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తెచ్చుకుంటామని....అడ్డాకల్ పోలీసులపై సదరు ఎమ్మెల్యే పాత గన్ మన్ తీవ్రస్థాయిలో ఒత్తిడిలు తీసుకువస్తుండడం కొసమెరుపు.
ఇసుక మాఫియాను....అడ్డుకుంటాం
మహబూబ్ నగర్ జిల్లా దేవర్ కద్ర నియోజకవర్గo ముసాపేట్ మండలంలో ఇసుక మాఫియా మళ్లీ, మళ్ళీ రెచ్చిపోతున్న....అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవిన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా, తాపీగా చోద్యం చూస్తున్నారని, గతంలో ఇసుక మాఫియాకు స్థానిక పోలీసులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయన్నారు సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్. గత 10 సంవత్సరాలుగాతాము ఇసుక మాఫియాపై పోరాడుతానే ఉన్నామని ఆయన తెలిపారు.నేనుసైతం" ఎల్లప్పుడూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటుదన్నారు.ఇకనైనా ముసాపేట్ మండల రెవిన్యూ, పోలీస్ అధికారులు స్పందించి ఇసుక మాఫియాపై వాల్టా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ..." నేనుసైతం" ఆధ్వర్యంలో మళ్ళీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తామని....ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటామని సామాజిక కార్యకర్త, ..." నేనుసైతం" స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు.