సహాయ ఫౌండేషన్ సభ్యులని అభినందించిన తెలంగాణ ఫైనాన్స్ సెక్రెటరీ రొనాల్డ్ రాస్

రొనాల్డ్ రాస్  గౌరవ కలెక్టర్ -తెలంగాణ ఫైనాన్స్ సెక్రెటరీ బీ.ఆర్.కే భవన్, హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో సహాయ ఫౌండేషన్ సభ్యులు అనతికాలంలో చేసిన సేవాకార్యక్రమాలను తెలుసుకొని ఫౌండేషన్ సభ్యులని అభినందించారు.సహాయ ఫౌండేషన్ సభ్యులు నేటి వరకూ దాదాపుగా 4500 మందికి  పైగా రక్తదానాలు చేసి వారి ప్రాణాలని నిలిపిన సహాయ ఫౌండేషన్ సభ్యులు దైవ సమానులు, కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళలో సొంతఖర్చుతో 1000 మందికి 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడమే కాకుండా సొంతఖర్చులతో కరోనా మృతులకు వారివారి సంప్రదాయాల ప్రకారం సొంత ఖర్చులతో అంత్యక్రియలు జరిపి మనుషుల్లో దైవం ఉంది అని నిరూపించిన సహాయ ఫౌండేషన్ సభ్యులు, వారి సేవా కార్యక్రమాలు చిరస్మరణీయము అన్నారు.ఈ సందర్భంగా రొనాల్డ్ రాస్  మాట్లాడుతూ సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టంకరి శివప్రసాద్ యాదవ్ అధ్యక్షతన మరెన్నో సేవాకార్యక్రమాలు జరపాలని ఫౌండేషన్ కి తమ వంతు సహకారాన్ని ఎల్లవేళలా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.టి.ఎం.వెంకటయ్య , ఫౌండేషన్ సభ్యులు పత్తి మహేష్, నవీన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.