మతసామరస్యానికి ప్రతీక రంజాన్ : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి...
మహబూబ్ నగర్ 21
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి...
రంజాన్ పర్వదినం మానవత్వం, ప్రేమ, మతసామరస్యానికి ప్రతీక అని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని నగరంలోని ఈద్గా ప్రాంగణంలో ఖౌమి ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాదిమంది ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) నిర్వహించారు. అనంతరం ఆయన ముస్లిం సోదరులను కలిసి హృదయపూర్వకంగా పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ మనుషుల మధ్య ప్రేమ, సహనం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్ర పర్వదినమని తెలిపారు. ఉపవాస దీక్ష ద్వారా ఆత్మశుద్ధి సాధించి, బలహీన వర్గాలకు తోడ్పాటు అందించాలని ఈ పండుగ మనకు సందేశం ఇస్తుందని అన్నారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అలాగే నగరంలో అన్ని వర్గాల ప్రజలు తమ తమ పండుగలను ఆనందంగా జరుపుకుంటూ సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు.
మన పూర్వీకులు చూపిన ఐక్యత మార్గంలోనే ముందుకు సాగాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్.పీ. వెంకటేష్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, తదితరులతో పాటు నగర కార్పొరేటర్లు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.