ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిస్కారం

 ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  ఎస్.వెంకట రావు అన్నారు.

        ధరణిపై మంగళవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో తహసిల్దార్ లతో సమీక్షించారు.
      ధరణి లో పెండింగ్  ఉన్న సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు వచ్చే సూచనలను ఆధారం చేసుకుని పరిష్కారం చేయాలని చెప్పారు. 
         ధరణి లో ఎక్కువ దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా ఇకపై తాను కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తానని, ప్రతి రెండవ, 4  వ బుధవారం సమీక్షిస్తానని, అదేవిధంగా ప్రతి మొదటి, మూడవ బుధవారాలు పర్యవేక్షక అధికారులైనా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,డి ఆర్ ఓ, ఆర్డీవోలు మండలాలకు వెళ్లి సంబందిత తాహసిల్దార్ లతో సమీక్షించాలని ఆయన సూచించారు. ధరణి రికార్డుల తనిఖీ నివేదికలను  సమర్పించ వలసిందిగా ఆదేశించారు.
     ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధరణిలో పెండింగ్ లో ఉన్న సక్సేషన్, కోర్టు కేసులు, పి ఓ టి, జి ఎల్  ఎం,నాల,ప్రోహిబిటెడ్  తదితర దరఖాస్తుల పై తహసిల్దార్ లతో సమీక్షించారు.
         స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,డి ఆర్ ఓ కె.స్వర్ణ లత,ఆర్ డి ఓ పద్మ శ్రీ, తాసిల్దార్ లు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.