పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో MRO కి వినతి పత్రం

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు  మహబూబ్ నగర్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో MRO కి వినతి పత్రం అందజేత.

 
 
దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా లో భాగంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్ గారి ఆదేశానుసారం గురువారం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్బన్ MRO గారికి వినతి పత్రం సమర్పించాడం జరిగింది. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికల్లో వచ్చినప్పుడల్లా పథకాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు వెంటనే డబుల్ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలన్నారు. దళితబందు కోఆర్డినేటర్ ఖాజా ఫ ఖ్రుద్దిన్ మాట్లాడుతూ దళిత బంధు అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. రాష్ట్రంలోని దళిత గిరిజనులకు దళిత బందు అమలు చేయాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత సత్తూరు చంద్ర కుమార్ గౌడ్, పీసీసీ కార్యదర్శులు ఎన్. పి. వెంకటేష్, S వినోద్ కుమార్, డీసీసీ ఉపాధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనిత  జిల్లా కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ CJ బెనహర్ ,పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్,మండల అధ్యక్షుడు నసింహరెడ్డి.హన్వాడ మెడల్ అధ్యక్షుడు వెంకటయ్య. మహబూబ్ నగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జె.చంద్రశేఖర్,  మహబూబ్ నగర్ SC ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సాయి బాబా.మైనారిటీ అధ్యక్షుడు జాహిర్ అక్తర్. NSUI అధ్యక్షుడు ఆవేజ్. సెల్ పట్టణ అధ్యక్షులు ఎర్పుల నాగరాజు.మైనారిటీ ఉపాధ్యక్షుడు ఫయాజ్. INTUC రాములుయాదవ్.OBC అధ్యక్షుడు మల్లేశ్ మైనారిటీ అధ్యక్షుడు అజ్మత్.యూత్ ప్రెసిడెంట్ అబ్దుల్ హాక్.టౌన్ ఆర్గనైగింగ్ సెక్రెటరీ ఖాదర్. సేవాదల్ పట్టణ అధ్యక్షుడు అలీ. అల్తాఫ్. సదీక్. పాషా. కాజా.వెంకట లక్మి.సుజాత.సహజ.కాంగ్రెస్ నాయకులు, మరియు కార్యకర్తలు  గంగిరెడ్డి. శంకర్.కృష్ణయ్య.తహెర్.MDజాహిర్. పెద్ద ఎత్తున పాల్గొన్నారు జరిగింది.