వైకుంఠధామాలలో అంత్యక్రియలు జరిగేలా ప్రజలను చైతన్యం చేయాలి
చెత్త ద్వారా కంపోస్ట్ ఎరువు తయారు చేయడం పై దృష్టి సారించాలి . గుర్తించిన అన్నిచోట్ల తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు గ్రౌండ్ చేయాలి వైకుంఠధామాలలో అంత్యక్రియలు జరిగేలా ప్రజలను చైతన్యం చేయాలి ఎం పి డివో లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి.రవినాయక్. ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో కూలీల సంఖ్యను పెంచాలని, తెలంగాణకు హరితహారం లో భాగంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని అన్ని నర్సరీలలో నీడ ఇచ్చే విధంగా నెట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎంపీడీఓ లు,ఎం పి ఓ ల తో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.దళిత బంధు పథకం కింద మొబైల్ యాప్ లో వివరాలను 93% అప్లోడ్ చేయడం జరిగిందని, తక్కినవి కూడా అప్లోడ్ చేయాలని చెప్పారు. ఎంపీఓలు నెలలో తప్పనిసరిగా 16 గ్రామ పంచాయతీలను తనిఖీచేయాలని గ్రామాలకు వెళ్ళినప్పుడు డంపింగ్ యార్డులను సందర్శించాలని ఆదేశించారు. ఈ నెలాఖరునాటికి అన్ని గ్రామా పంచాయతీలలో పన్నుల వసూలు పూర్తి చేయాలని అన్నారు. పౌర సేవలకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటిని తక్షణమే పరిష్కరించాలని చెప్పారు.ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో సరాసరి కూలీల సంఖ్య 41 ఉందని, ఈ సంఖ్యను పెంచాలని ఆదేశించారు. కూలీలు పని చేసే చోట ఓఆర్ఎస్ పాకెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మైనార్టీ శాఖ ద్వారా అమలు చేస్తున్న ఆర్థిక చేయూత పథకం కింద లబ్ధిదారుల ఎంపిక జాబితాలను పంపించాలని ఎంపిడిఓ లను ఆదేశించారు. గ్రామపంచాయతీలకు అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులు రాకుండా అనవసరంగా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించే ఏర్పాటు చూడాలని తెలిపారు. వైకుంఠధామాలలో అంత్యక్రియలు జరిగే విధంగా గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేయాలని, ఒకవేల సౌకర్యాలు లేక అంత్యక్రియలు చేయనట్లయితే అన్ని వైకుంఠధామాలలో విద్యుత్ కనెక్షన్ ,నీటి సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం, బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలలోభాగంగా గుర్తించిన అన్ని స్థలాలలో తక్షణమే పూర్తి చేయాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశించిన డిజైన్ కనుగుణంగానే గ్రామీణ క్రీడా పొంగనాలు నిర్మించాలని అన్నారు. ఈ - శ్రామ్ కింద అసంఘటిత కార్మిక రంగంలో పనిచేసే కార్మికులందరికీ రిజిస్ట్రేషన్ చేయించాలని, సోషల్ ఆడిట్ రికవరీపై దృష్టి సారించాలని ఆదేశించారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు ,డిఆర్డిఓ యాదయ్య, ఏపీడి జకీయా సుల్తానా, డిపిఓ వెంకటేశ్వర్లు, డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.