శాంతియుత వాతావరణం తద్వారా అభివృద్ధి సాధ్యం డి.జి.పి. ఎం.మహేందర్ రెడ్డి

 పోలీసు శాఖలోని సిబ్బంది, అధికారుల సమన్వయం, చట్టాల అమలులో నిబద్ధత వలన శాంతియుత వాతావరణం తద్వారా అభివృద్ధి సాధ్యం అవుతున్నదని రాష్ట్ర డి.జి.పి.  ఎం.మహేందర్ రెడ్డి  అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేటి మధ్యాహ్నం డి.జి.పి.  శాంతిభద్రతల సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా జిల్లాల వారీగా పోలీసు పని తీరును అభినందించారు. ముఖ్యంగా వివిధ సందర్భాలలో నిర్వహించిన బందోబస్తులను, నేరస్థులకు శిక్ష ఖరారు చేయించే క్రమంలో దర్యాప్తు, తదుపరి వ్యవహారాలలో క్రమశిక్షణ, పురోగతి పట్ల అధికారులను ప్రశంసించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్.పి.  ఆర్.వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ...
జిల్లాలోని విలేజ్ పోలీసు ఆఫీసర్స్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఉత్తేజితం చేయడం, గ్రామాల్లోని ప్రజలు, యువత, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడం.
నేరాలకు పాల్పడేవారి జీవితం సమాజంలో గౌరవం లేకుండా, దుర్భరంగా ఉంటుందన్న విషయాలను ఉదాహరణలతో సహా చర్చిస్తూ సమాజాన్ని జాగృతం చేయడం.
ఇటీవల కురిసిన భారీ వర్షాల సందర్భంగా సంబంధిత శాఖలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో పోలీసు శాఖ తీసుకున్న చర్యలు.
పోలీసు స్టేషన్ పరిశుభ్రత నుండి ఫిర్యాదుల స్వీకరణ, సత్వర పరిష్కారం, డయల్ 100 కాల్స్ కు స్పందనకై ప్రత్యేక కార్యాచరణ.
నేరాల నివారణకుగానూ అదనంగా పోలీసు పెట్రోలింగ్ బృందాల ఏర్పాటు, పాత నేరస్థుల కదలికలు మరియు గ్రామాలు, కాలనీల్లో కొత్త వ్యక్తుల గురించి ఆరా తీస్తూ నిఘా.
జిల్లాలో నేరాలను అరికట్టేందుకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్.పి. గారు చేస్తున్న కృషి పట్ల డి.జి.పి. గారి అభినందన.
నిందితులను కోర్టులో హాజరు పరిచేందుకుగానూ, వారెంట్లు, సమన్లను ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు కోర్టు విధులు నిర్వహించే సిబ్బందికి సర్కిల్ స్థాయిలో అనుభవజ్ఞులైన అధికారులచే చర్చ.
కరోనా మహమ్మారి ప్రమాదం తొలగిపోలేదని, ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బాల్య వివాహాలు, మహిళా రక్షణ చట్టాలు, బాల కార్మిక చట్టాలను వివరిస్తూ పోలీసు కళా బృందం, షీ పోలీస్ సమన్వయంతో పల్లెల్లో నిరంతర కార్యక్రమాలు. మరోవైపున చట్టపరమైన చర్యలకై పోలీసు బృందాల ఏర్పాటు.
ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో జిల్లా పోలీసు ఉత్తమ పని తీరు కనపర్చడం పట్ల రాష్ట్ర డి.జి.పి. ఎస్.పి. ని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.పి. అడ్మిన్ ఎన్ . వెంకటేశ్వర్లు, డి.ఎస్.పి.  జి.శ్రీధర్, ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు.