గణేష్ నగర్ లో పవన్ జన్మదిన వేడుకలు

గణేష్ నగర్ లో పవన్ జన్మదిన వేడుకలు..!
-రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సీఐ హనుమప్ప
మహబూబ్నగర్ పట్టణంలోని గణేష్ నగర్ కాలనీలో విజయ్ ఆధ్వర్యంలో పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు గురువారం మహబూబ్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమప్ప చేతులమీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ అభిమానులతో పాటు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమప్ప మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానులు రక్తదానం చేయడం సంతోషకరమని సమాజం కోసం పవర్ స్టార్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న కృషి ఎనలేనిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 30 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి , నాయకులు నరేందర్ తిరుపతయ్య గౌడ్, అభిమాన సంఘం నేతలు బషీర్ శ్రీకాంత్ సాయి అఖిల్, విష్ణు గణేష్ తో పాటు భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.