పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకైక తెలుగు రాష్ట్రం తెలంగాణ ఎమ్మెల్యే యేన్నం శ్రీనివాసరెడ్డి

 మహబూబ్ నగర్ బ్యూరో... ఆగష్టు 14

 
 పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి....
 
పేదలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం...
16 నెలల్లో మూడు కొత్త ఇంజనీరింగ్ కళాశాలలు... 
 
 
              పేదల సంక్షేమమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ రూరల్ మండలం లోని మాచన్ పల్లి గ్రామంలోని ఎఎంఆర్ గార్డెన్ హాల్ లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై 445 మంది లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. ఈ రోజు పేద ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలు తమకు రేషన్ కార్డులు లేవని , ఇండ్లు లేవని అడిగారని ఆరోజు మాట ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు లేని నిరుపేదలకు మహబూబ్ నగర్ మండలంలో 776 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటికే 442 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ప్రారంభం కావడం జరిగిందని, 3 కోట్ల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు.  
            దేశంలోనే రేషన్ షాపుల్లో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని ఆయన స్పష్టం చేశారు. ఆర్థికంగా పేద ప్రజలను బలోపేతం చేయడానికి ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. 16 నెలల కంటే ముందు ఒక్క ఇంజనీరింగ్ కళాశాల కూడా మన మహబూబ్ నగర్ లో లేదని , ఇప్పుడు మూడు కొత్త ఇంజనీరింగ్ కళాశాలలు మన మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వచ్చాయని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో వంద మంది పేద విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యను చదవాలనే కోరిక ఉండి చదువుకోవడానికి స్థోమత లేని నిరుపేద కుటుంబానికి చెందిన పిల్లలకు ఈ అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.