నకిలీ విత్తనాలు సరఫరా చేసిన నిందితుడి పై PD యాక్ట్ కేసు.

 నకిలీ విత్తనాలు సరఫరా చేసిన  నిందితుడి పై PD యాక్ట్ కేసు.

 
కల్తీ  విత్తనాలు అక్రమ సరఫరా చేస్తూ రైతులను మోసం చేస్తున్న కొండప్ప నాయుడు పై  పీడీ యాక్ట్ అమలు. జిల్లా ఎస్పీ. డాక్టర్ చేతన ఐపిఎస్.
 
నారాయణపేట జిల్లా కోస్గి పోలీస్ స్టేషన్  పరిధిలో కల్తీ  పత్తి విత్తనాలు అక్రమ సరఫరా చేస్తూ రైతులపై  మోసాలకు పాల్పడుతున్నా కొండప్ప నాయుడు S/o వెంకటేశ్వర్లు నాయుడు , వయస్సు-42, అతని సొంత ఊరు నెల్లూరు జిల్లా నుండి దౌల్తాబాద్ గోక పస్లా బాద్ అత్త వారి ఇంట్లో ఉంటూ అక్కడి నుండి  ప్రస్తుతం కోస్గి లో నివసిస్తున్నాడు. కొండప్ప నాయుడు పై నకిలీ విత్తనాల  విషయంలో కోస్గి పోలీస్ స్టేషన్లో 03 కేసులు, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లో 01 కేసులు, బషీరాబాధ్ పోలీస్ స్టేషన్లో 03 నమోదు చేయడం జరిగింది. మూడు రోజుల క్రితం బషీరాబాధ్ పోలీసులు అతనిని రిమాండ్ కు తరలించారు. అతడు ప్రస్తుతం పరిగి సబ్ జైల్ లో ఉండగా కోస్గి పోలీసులు జిల్లా కలెక్టర్ గారి ఆర్డర్స్ తో అతనిపై పి.డి యాక్ట్ నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. "నకిలీ విత్తనాల అక్రమ వ్యాపార నేరస్తుని " పై జిల్లా  ఎస్పీ డాక్టర్ చేతన ఐపిఎస్ గారు  పీ.డీయాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసారు. ఎస్పీ గారు  జారీ చేసిన ఉత్తర్వులను కోస్గి  సర్కిల్  ఇన్స్ స్పెక్టర్‌ రామ్ లాల్ గారు , ఎస్సై నరేందర్ గారు పీ.డీ యాక్ట్ నిర్బంద ఉత్తర్వులను పరిగి సబ్ జైల్ లో అందజేసి అనంతరం అతనిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించడమైనది.ఈ సందర్భంగా ఎస్పీ   మాట్లాడుతూ నకిలీ విత్తనాల ద్వారా రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా చుసుకునే గట్టి చర్యలలో భాగంగా   నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై మరియు మాయ మాటలు చెప్పి రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు కొన్ని ఉత్తర్వులను జారీ చేసిందని ఇందులో భాగంగానే నకిలీ విత్తనాలను అమ్మేవారిపై మరియు సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసు  అధికారులు కృతనిశ్చయంతో నకిలీ విత్తనాల అక్రమ వ్యాపారం సరఫరా చేస్తున్నటువంటి కొండప్ప నాయుడుపై ఈరోజు  పి.డి యాక్ట్ అమలు చేయడం జరిగింది అని అన్నారు.జిల్లా లో ఎవరైనా  నకిలీ సీడ్స్ ను అమ్మిన, సరఫరా చేసిన, అలాంటి వారికి సహకరించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అలాంటి వారి పై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించడం తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. జిల్లా లో ఎవరైనా ఆర్గనైజర్లమంటూ నకిలీ సీడ్స్ ను అమ్ముతున్నట్లు, సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టి కి వచ్చిన రైతులు సంబంధిత  పోలీస్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి  తీసుకరావాలి, లేదా డయల్ -100 కాల్ చేసి సమాచారం అందించిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎస్పీ. తెలిపారు.