బీసీల అభ్యున్నతికి అడ్డంకులు

 *బీసీల సామాజిక ఉన్నతికి అడ్డంకులు!* 

 
 *ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల అమలు ఎక్కడ?* 
 
 *వైద్య విద్యలో కూడా అన్యాయమేనా?* 
 
 *ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలవర్ధన్ గౌడ్ ఆవేదన* 
 
 *బీసీల గొంతులు కోసే వారి పనిపడదాం అంటూ పిలుపు*
 
జడ్చర్ల : భారతదేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిస్తే.. కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనగడొక్కుతున్నారని ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు, జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎడ్ల బాల వర్ధన్ గౌడ్ మండిపడ్డారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం బిసి రిజర్వేషన్లు ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఎక్కడా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో జనాభా దామాషా ప్రాతిపదికన అమలు చేయాల్సి ఉన్నా.. ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయడం లేదని వాపోయారు. అన్ని రంగాలలో అత్యధిక ప్రాధాన్యతను చాటుకుంటున్న బీసీలు సామాజిక ఉన్నత స్థితికి కృషి చేస్తుంటే.. అగ్రవర్ణాలకు మంట ఎందుకని మండిపడ్డారు. అగ్రవర్ణాల వారే బిసి రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీసీ బిడ్డలు  డాక్టర్ల కాకుండా అడ్డుపడుతున్నారని,
బీసీలను మోసం చేసే వారికి బుద్ధి చెప్పాలన్నారు. 
కేంద్ర మెడికల్ కాలేజీలు, రాష్ట్ర మెడికల్ కాలేజీలు మరియు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో  సీట్లను నీట్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మిగతా 15 శాతం మెడికల్ ఎంబీబీఎస్ సీట్లను, 50 శాతం మెడికల్ పీజీ సీట్ల ను  కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తూ ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న సీట్లలో ఓసీలకు ఈడబ్ల్యూ  రిజర్వేషన్ మరియు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ లు 2018 నుంచి అమలు చేస్తూ ఉన్నారని, కానీ బీసీలకు ఈ  మెడికల్ కాలేజీల్లో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు జరగడం లేదని,  దీనివల్ల సుమారు 11 వేల మెడికల్ సీట్లను బీసీ విద్యార్థులు కోల్పోవడం జరిగిందన్నారు. ఈ కాలేజీలో పేదలైన ఓసీలకు కూడా రిజర్వేషన్ కల్పించారు కానీ.. బీసీలకు మాత్రం రిజర్వేషన్లు కల్పించకపోవడం సమంజసమేనా అని ఆక్షేపించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50 శాతం మేనేజ్మెంట్ కోటా కింద కాలేజీ యాజమాన్యం సీట్లను భర్తీ చేయడం జరుగుతుందని, మిగతా 50 శాతం సీట్లను ఓసీలకు, ఈ డబ్ల్యూ ఎస్  రిజర్వేషన్లు,  బీసీ , ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేసి భర్తీ చేయడం జరుగుతుంది.. కానీ బీసీ బిడ్డలు డాక్టర్ల కాకుండా తీవ్ర వివక్ష చూపిస్తున్నారని, రాజాధికారం లో భాగం పొందేందుకు ప్రతి బిసి బిడ్డ మేలుకోవని, రాజ్యాధికారం కోసం మరో ఉద్యమం చేద్దామని,  బాల వర్ధన్ గౌడ్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.