మహబూబ్ నగర్ జిల్లాలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ బృందం

 పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శనలో భాగంగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ బృందం గురువారం మహబూబ్ నగర్ జిల్లాలోని కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్ తో పాటు,కొన్ని చెరువులను పరిశీలించింది.

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు బృందం సభ్యులు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద రిజర్వాయర్లు,చెరువులు, సాంకేతికపరమైన అంశాలతో పాటు ,ఇతర  విషయాలపై నిన్న, ఈరోజు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం  పరిధిలో పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. సి ఎస్ ఐ ఆర్,సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు,మైనింగ్  శాఖల ప్రతినిధులతో పాటు , నోడల్ ఏజెన్సీ ప్రతినిధులు ,ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు.జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టరు తేజస్ నందలాల్ పవార్ లు  కమిటీ  సభ్యులతో పాటు ఉన్నారు.కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లు, చెరువులు పరిశీలించిన బృందం వారి నివేదికను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కు అందజేయనుంది.