పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ మరియు అవగాహన తరగతులు
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ మరియు అవగాహన తరగతులను ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులకు గణితము ఆంగ్లము తెలుగు బయో సైన్స్ హిందీ సాంఘిక శాస్త్రము ఫిజికల్ సైన్స్ మొదలగు అంశములపై జిల్లాలోని నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక పాఠ్యాంశాలను బోధించడం జరిగినది అదేవిధంగా మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ లక్ష్మణ్ నాయక్ సైకాలజిస్ట్ గారిచే విద్యార్థులు 10/10 జిపిఎస్ సాధించుటకు చేయవలసిన అంశాలపై వివరణ ఇవ్వడం జరిగినది అలాగే 100% ఉత్తీర్ణత సాధించుటకు మెలకువలను తెలియజేయడం జరిగినదిసైకాలజీ కి సంబంధించిన ప్రేరణ తరగతులను నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో. మహబూబ్నగర్ దేవర్కద్ర నవాబుపేట సీసీ కుంట జడ్చర్ల. వస్పుల్ కోయిలకొండ మహ్మదాబాద్ నంచర్ల వెన్నచెడు మూసాపేట్ కు చెందిన కు చెందిన 327 మంది విద్యార్థులు పాల్గొన్నారు వీరికి ఆల్ ఇన్ వన్ నోట్ బుక్ ప్యాడ్ పెన్ను పంపిణీ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి. శ్రీ యాదయ్య గారు ఉపసంచాలకులు శ్రీ వి పాండు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేక బోధనా తరగతులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు హాస్టల్ లో ట్యూటర్లచే పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పెషల్ డైట్ ఇస్తున్నామని ఈసారి 100% రిజల్ట్ రావడానికి కృషి చేస్తామని విద్యార్థులు లక్ష ము ఏర్పరచుకొని అందుకు కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ASWO విజయలక్ష్మి HWOS కృష్ణమోహన్. శివకుమార్ బాబురావు తురియానంద్. మోహన్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి అశోక్. శ్రీనివాస్ విష్ణు పుష్పవేని తారాబాయి యశోద మొదలగు వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు