నూతన రేషన్ కార్డ్స్ ను పంపిణీ చేసిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్.

 నూతన రేషన్ కార్డ్స్ ను పంపిణీ చేసిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్.

 
మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మండలంలోని కోడూర్ గ్రామ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డ్స్ ను మహబూబ్ నగర్ మండలానికి చెందిన  లబ్ధిదారులకు ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్  చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది.
 
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, అదనపు కలెక్టర్ సీత రామారావు ,డిఎస్పీ శ్రీధర్,ఆర్డీవో పద్మశ్రీ ,జెడ్పిటిసి వెంకటేశ్వరమ్మ,రైతు సమన్వయ కమిటీ జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహా రెడ్డి పిఎ.సి.యస్ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి ,ఎంపీపీ సుధాశ్రీ రాఘవేందర్ గౌడ్,
వైస్ ఎంపీపీ అనిత మాజీ మార్కేట్ కమిట్ చర్మన్ కాడం ఆంజనేయులు , మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ,కోడూర్ సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్ ,, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.