మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ కులసంఘాల తో రవీంద్రభారతిలో ఆత్మీయ సమావేశం
రాష్ట్రంలో గౌడ , SC , ST కులస్తులకు వైన్ షాప్ లలో రిజర్వేషన్లు ను కల్పించినందుకు క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ కులసంఘాల తో రవీంద్రభారతిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో MLC గంగాధర్ గౌడ్, సీనియర్ శాసన సభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్, BC కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ప్రభుత్వ విద్యా మౌలిక సదుపాయాల కల్పన శాఖ చైర్మన్ నాగేందర్ గౌడ్, గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణరావు గౌడ్, బాలగొని బాలరాజు గౌడ్, మాజీ చైర్మన్ రాజేశం గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, ప్రతాని రామకృష్ణ గౌడ్, డా. విజయ భాస్కర్ గౌడ్, నాగేశ్వరరావు, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, వేములయ్య గౌడ్, చింతల మల్లేశం గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, రాజయ్య గౌడ్, ప్రతాప్ లింగం గౌడ్, అంబాల నారాయణ గౌడ్, యూనివర్సిటీ నాయకులు రవికుమార్ గౌడ్, SC నాయకులు చందు, జంబులయ్య, ST నాయకులు కిషన్ నాయక్ తదితర రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.