మయూరి పార్క్, పిల్లలమర్రి టూరిజం
కోవిడ్ కారణంగా గత మార్చి నుండి మూతపడిన మయూరి పార్క్, పిల్లలమర్రి టూరిజం కేంద్రంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన కేసీఆర్ పార్కులను అక్టోబర్ 1 నుండి తిరిగి తెరిచినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుండి మయూరి పార్కు తో పాటు, కెసిఆర్ పార్క్, అలాగే పిల్లలమర్రి టూరిజం కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రదర్శనకు వచ్చే పర్యాటకులు మాస్కు ధరించటంతో పాటు సామాజిక దూరం పాటించాలని కోరారు.పై 3 పర్యాటక కేంద్రాల సందర్శనకు వచ్చే వారికి కోవిడ్ పై అవగాహన కల్పించేలా బోర్డుల ఏర్పాటుతో పాటు, చేతులకు శానిటైజర్ వేసిన తర్వాతే పర్యాటకులను లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. తన ఆదేశాల మేరకు జిల్లా అటవీ శాఖ అధికారి గంగారెడ్డి,జిల్లా పర్యాటక అధికారి యు. వెంకటేశ్వర్లు పర్యాటక కేంద్రాలలో ఏర్పాట్లు పర్యవేక్షించారని తెలిపారు.