ఆర్మీ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్... నిందితుడికి రిమాండ్
ఆర్మీ మధ్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
--- నిందితుని నివాసంలో 33 లీటర్ల మధ్యం స్వాధీనం
-- నిందితుడికి రిమాండ్
-- జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం సుధాకర్
మహబూబ్ నగర్.....
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీ వందన విహార్ అపార్ట్మెంట్ లో ఆర్మీ మధ్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ టాప్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.అతడి నుంచి 33 లీటర్ల మధ్యం స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం సుధాకర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా టాస్క్ ఫోర్స్ టీంకు మహబూబ్ నగర్ పట్టణం లోని వెంకటేశ్వర కాలనీ వందన విహార్ అపార్ట్ మెంట్ నివాసముంటున్న జి. సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటిలో ఆర్మీ మధ్యం విక్రయిస్తున్న సమాచారం తెలుసుకున్నారు. దీంతో సుదర్శన్ రెడ్డి నివాసాన్ని ఎక్సైజ్ శాఖ టాక్స్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు .ఈ తనిఖీలలో వివిధ బ్రాండ్ల కు చెందిన (33) డిఫెన్స్ మధ్యం సీసాలు లభ్యమైనమయని. ఈ మద్యం విలువ (90) వేల వరకు ఉంటుందని తెలిపారు. ఈ మద్యాన్ని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల దగ్గర కొంటున్నట్లు విచారణలో తెలినట్లు ఎస్పీ తెలిపారు. సుదర్శన్‌రెడ్డి రిటైర్డ్ ఆర్మీ అధికారుల దగ్గర కొని మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు వినియోగ దారులకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నారని తెలిపారు. సుదర్శన్ రెడ్డి పై గత రెండు నెలల నుంచి నిఘా ఉంచి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. సుదర్శన్ రెడ్డి వినియోగిస్తున్న సెల్ ఫోన్ తో పాటు తనిభీలలో లభ్యమైన (33) మద్యం సీసాలలోని 25 లీటర్ల మద్యం ను స్వాధీనం చేసుకొని సుదర్శన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులలోని కొందరు తమ వ్యక్తిగత అవసరాలకై ఆర్మీ క్యాంటీన్ లోని మద్యం ను వినియోగించుకోకుండా తమ కోటా లోని మద్యం సీసాలను తక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిపారు. ఇక ముందు ఆర్మీ ఉద్యోగులపై కూడ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్సైజ్ అధికారి హెచ్చరించారు. మహాబూబ్ నగర్ పట్టణంలో కొంత మంది నిర్వహించే పంక్షన్లలో, పార్టీలలో కూడ డిఫెన్స్ మద్యం సరఫరా చేస్తున్నట్లు విచారణ లో తేలిందన్నారు, ఈ సందర్బాలలో పంక్షన్ హాల్ నిర్వహాకులపై కూడ కఠిన చర్యలు తీసుకుంటామని, డిఫెన్స్ మద్యం, రాష్ట్రాలకు చెందిన మద్యం ఎవరైనా అమ్ము చున్నట్లు అనుమానం వచ్చిన అట్టి వ్యక్తుల సమాచారాన్ని 87126 58872 నెంబర్ కు తెలిపిన వారిపై నిషూ ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ అధికారి సూపరింటెండెంట్ తెలిపారు. ఈ తనిఖీలలో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ సిఐ కవిత,ఎస్ఐ రాజేందర్ , మిగతా సిబ్బందిని ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా డిప్యూటి కమీషనర్ A విజయ భాస్కర్ రెడ్డి అభినందించనారు.