మహబూబ్ నగర్ గర్ జిల్లా ను సుందర నగరం గా తీర్చిదిద్దుతాం
మహబూబ్ నగర్ గర్ జిల్లా ను సుందర నగరం గా తీర్చిదిద్దుతాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
సమిష్టి కృషి వల్లనే మహబూబ్ నగర్ జిల్లాలో పచ్చదనం పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు .
ముక్కోటి వృక్షార్చనలో భాగంగా శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటారు.
ముందుగా ఇండియాలోనే అతి పెద్దదైన కెసిఆర్ ఎకో అర్బన్ పార్కులో మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో దేశంలోనే అతి పెద్దదైన 2097 ఎకరాలలో అర్బన్ ఎకో పార్కును ఏర్పాటు చేయడం జరిగిందని ,ఈ పార్కును అన్ని రకాలుగా అభివృద్ది చేస్తామని అన్నారు. భూత్పూర్- మహబూబ్ నగర్ రహదారిపై కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతామని తెలిపారు. జిల్లా కేంద్రంలో 30 వరకు పార్కులను అభివృద్ధి చేశామని ,రోడ్ల వెంట మొక్కలు నాటడం వల్ల పట్టణం రూపురేఖలు మారిపోయాయి పెద్ద ఎత్తున పచ్చదనం పెరిగిందన్నారు.మొక్కలు నాటడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం రావడమే కాకుండా ,ఆరోగ్యం, ఆక్సీజన్ వస్తాయని, జిల్లాలో హరితహారం కార్యక్రమం కారణంగా పచ్చదనం పెరిగిందని, ఇది సమిష్టి కృషి వల్లనే సాధ్యమైంది అని అన్నారు .
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోరిక మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 3 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించడం జరిగిందని ,ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే రోజున 11 లక్షల మొక్కలను నాటుతున్న ట్లు తెలిపారు .
చెట్ల వల్ల అన్ని జీవరాశులు బతకడమే కాకుండా గాలి, నీరు వస్తుందని అన్నారు. ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా మొక్కలు నాటాలని, మున్సిపల్ అధికారులు కూడా మొక్కలు నాటిన వారికి ఇండ్ల అనుమతి ఇచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, మున్సిపల్ చైర్మన్ కె సి. నర్సింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్ ,డిసిసి ఉపాధ్యక్షుడు వెంకటయ్య ,అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్,కె. సీతారామారావు, జిల్లా అటవీశాఖాధికారి గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, డిఆర్డిఓ యాదయ్య, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.