మల్టీ పర్పస్ షెడ్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మల్టీ పర్పస్ షెడ్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే... 

 
మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఎదిర శివాలయం ఆవరణలో 10 లక్షల రూపాయల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న మల్టీ పర్పస్ షెడ్ నిర్మాణపు పనులకు గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అంతకుముందు శివాలయంలో కొలువైన మహాశివుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి వేద ఆశీర్వాదం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, అజ్మత్ అలి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హనుమంతు, ఖాజా పాషా, రషెద్ ఖాన్, అంజద్, అచ్చుగట్ల అంజయ్య, రామాంజనేయులు, నాయకులు రమేష్ యాదవ్, రాములు బచ్చన్న, చర్ల శ్రీనివాసులు, గ్యాస్ అంజి, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.