బీటి రోడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

గంగాపూర్ - లింగంపేట్ బీటీ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి.

రూ.65.00 లక్షలతో బీటీ రోడ్డు నిర్మణం. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.
జడ్చర్ల మండలం గంగాపూర్ నుండి లింగంపేట్ వరకు 6 కిలోమీటర్ల బీటీ రోడ్డు రెన్యువల్ పనులను మార్గమధ్యలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు రూ.65.00 లక్షలు మంజూరు చేసుకున్నాం అని అన్నారు. రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలని రోడ్డు పనులలో నాణ్యత పాటించాలని సదరు కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ముందుగా రోడ్డు మార్గంలో పూర్తిగా పాడైపోయిన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.