జిల్లా పోలీస్ ప్రధానకార్యాలయంలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం ఫర్ వుమెన్
డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మహబూబ్నగర్ తరపున జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు “లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం ఫర్ వుమెన్” కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ నరసింహ హాజరైనారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఎన్నో రకాల చట్టాలు వచ్చాయి కానీ చాలామంది స్త్రీలకు అవగాహన లేక అన్యాయం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా స్త్రీల హక్కులు మరియూ చట్టాల గురించి వివరించారు, పూర్వ కాలం కూడా స్త్రీ సమానత్వ చట్టాలు ఎన్నో ఉన్న నేటి వరకు కూడా స్త్రీలకు సమానత్వం మరియు రక్షణ కరువైనది, ప్రస్తుతం స్త్రీలు చట్టాల అవగాహన గురించి తెలుసుకొని వారి జరుగుతున్న అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. జిల్లా పోలీసు తరపున కూడా కళాబృందం, ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు షీ టీం ద్వారా పరతినిత్యం అవగాహనా చేపట్టుతున్నామన్నారు.
ఈ కార్యక్రమం నందు శ్రీమతి ఎం సంధ్యారాణి, సీనియర్ సివిల్ జడ్జ్/డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ , రామ్ బాక్ష్ అడ్మిన్ పీపీ , బి జనార్ధన్ పి పి , డాక్టర్ తిరుపతి , డీఎస్పీలు వెంకటరమణ రెడ్డి , మధు , కొందరు సీనియర్ న్యాయవాదులు మరియు జిల్లా పోలీస్ మహిళ సిబ్బంది పాల్గొన్నారు .