చెరువుల గర్భం, గట్లు, ఎఫ్ టి ఎల్ లలో ఎట్టి పరిస్థితులలో లే అవుట్లు

  మున్సిపల్ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో చెరువుల గర్భం, గట్లు, ఎఫ్ టి ఎల్ లలో ఎట్టి పరిస్థితులలో లే  అవుట్లు, బిల్డింగ్ ప్రణాళికలు రావడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు  అన్నారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్లు, భవనాల నిర్మాణ అనుమతులను మంజూరు చేసినట్లయితే సంబంధిత పట్టణ ప్రణాళిక సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.

      మంగళవారం ఆయన  రెవెన్యూ సమావేశ మందిరంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో చెరువుల ఎఫ్ టి ఎల్ సర్వే పై  సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
       జిల్లాలో లో ఎఫ్ టి ఎల్ సర్వే విషయమై ఇంతకుముందే సమీక్ష నిర్వహించడం జరిగిందని, సుప్రీంకోర్టు, హైకోర్టు సూచనలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని మొదటి విడత  సర్వే చేయడం జరిగిందని అన్నారు.  ఇకపై ఎట్టి పరిస్థితులలో లేఅవుట్ల కానీ, భవనాల ప్రణాళికలు కానీ ఎఫ్ టి ఎల్ పరిధిలో,చెరువు లోపల, చెరువు గర్భంలో, గట్ల మీద కాని ఒక ఇల్లు కూడా రావడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు .
         చెరువుల ,శిఖం ఆక్రమనలపై గ్రామీణ ప్రాంతాలలో ఆగస్టు 5 నుండి 15 రోజుల లో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఎంపీవో ,గ్రామ పంచాయతీ కార్యదర్శి ,ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు  తనిఖీ చేసి ఎక్కడైనా చెరువు ఆక్రమణలు చేసి ఉన్నట్లైతే తక్షణమే  రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎఫ్ టి ఎల్ కు సంబంధించి కోర్టు కేసుల విషయంలో పూర్తి జాగ్రత్తలు వహించాలని, కంటెంప్ట్ వచ్చే వరకు ఆగకుండా ముందే వాటిపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా అన్ని చెరువులలో బఫర్ జోన్ లలో హరితహారం కింద మొక్కలు నాటాలని  అన్నారు.ఎఫ్ టి ఎల్  సర్వే సందర్భంగా నిర్మించే కట్టడాలకు శిఖరాలకు సంబంధించి పైన ఎర్ర కలర్ పెయింట్ వేయించాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్  తేజస్ నందలాల్ పవర్ ,డి ఆర్ ఓ కే .స్వర్ణలత,ఆర్ డి ఓ పద్మశ్రీ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి. శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ,సునీత ,తాసిల్దార్ లు, ఇరిగేషన్ ఇఇ మనోహర్, తదితరులు హాజరయ్యారు.