ఆత్మహత్యా ప్రయత్నానికిపాల్పడిన సుజాతని పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు కొత్వాల్
విధుల నుంచి తొలగించడం తో ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడిన అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సు సుజాతని పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు కొత్వాల్.
అవుట్ సోర్సింగ్ స్టాప్ ను గత నెల నుండి విధుల నుండి తొలగించడం తో మనస్తాపానికి గురైన స్టాఫ్ నర్స్ క్రిష్టియన్ పల్లి కి చెందిన సుజాత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సందర్బంగా సుజాతని డీసీసీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన లాంటి విపత్కర పరిస్థితులలో సైతం సేవలు అందించిన అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులను నిర్దాక్షిన్యంగా విధుల నుండి తొలగించడం విచారకరం అన్నారు. వారి డిమాండ్స్ ని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కాంగ్రేస్ పార్టీ తరపున కోరారు.