ఉద్యోగ హరిత యాత్ర...అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

  ప్రస్తుతం మంచి వర్షాలు కురుస్తున్నందున రాబోయే 10, 15 రోజుల్లో హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు .

      "ఉద్యోగ హరిత యాత్ర"లో భాగంగా శనివారం పాలమూరు విశ్వవిద్యాలయం గుట్టలలో  ఆయన విత్తన బంతులను వెదజల్లారు. అంతేకాక డ్రోన్ ద్వారా విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
                     జిల్లాలో  పచ్చదనం పెంపొందించేందుకు హరిత హారం ద్వారా రహదారులకిరువైపుల మొక్కలు నాటటమే కాక ,బ్లాక్ ప్లాంటేషన్,పల్లె ప్రకృతి వనాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 
         పాలమూరు  విశ్వవిద్యాలయం ఉప కులపతి లక్ష్మీ కాంథ్ రాథోడ్ మాట్లాడుతూ పాలమూరు విశ్వవిద్యాలయాన్ని పచ్చని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. గత సంవత్సరం హరితహారం కింద విశ్వవిద్యాలయంలో లక్ష మొక్కలు నాటగా, ఈ సంవత్సరం మరో లక్ష మొక్కలు నాటనున్నామని, మొక్కలు నాటడం తో పాటు వీటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ ఎస్ ఎస్,ఎన్ సి సి, బోధన ,బోధనేతర సిబ్బంది సహకారంతో నిరంతరం నీరందించి మొక్కలు సరక్షిస్తామని తెలిపారు. 
      డి ఆర్ ఓ కె. స్వర్ణలత, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శంకరాచారి ,డి ఆర్ డి ఓ యాదయ్య, జెడ్ పి సి ఈ ఓ జ్యోతి, జిల్లా అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .