పాలమూరు విశ్వవిద్యాలయంలో ఘనంగా జయశంకర్ జయంతి
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ని పురస్కరించుకుని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పాలమూరు విశ్వవిద్యాలయంలో నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథి ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంతం రథోడ్ గౌరవ ఉపకులపతి, ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్, రిజిస్ట్రార్, డాక్టర్ డి మధుసూదన్ రెడ్డి ఓఎస్డి, వెంకటేశ్వర్లు సహాయ రిజిస్ట్రార్ సూపరింటెండెంట్ రవీందర్ బోధన మరియు నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మీకాంతం రాథోడ్ ప్రసంగించారు. మరియు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంకితభావం మరియు నిబద్ధత యొక్క ఫిలోసఫీ, గొప్పతనం మరియు త్యాగం ఎంతో ఉందాన్నారు .తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన తొలి, మలి దశ ఉద్యమాలలో జయశంకర్ గారి మేధస్సు ఉద్యమకారులకు దివిటీ అయింది అన్నారు .