ఇది బీసీల పోరాట విజయం బీసీ సంక్షేమ సంఘం

 అఖిలభారత మెడికల్ అడ్మిషన్లలో మొదటిసారిగా ఓబిసి విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఇది బీసీల పోరాట విజయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు.

        శుక్రవారం కొత్తకోటలో ఏర్పాటు చేసిన సమావేశంలో  రాచాల మాట్లాడుతూ నీట్ అర్హత  పరీక్షలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని గత నాలుగు సంవత్సరాలుగా గల్లీ నుండీ ఢిల్లీ వరకు అనేక మార్లు ఆందోళనలు నిర్వహించామని, గత ఐదు రోజులుగా బీసీ సంక్షేమ సంఘం  రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీ పర్యటన చేపట్టి ఎనిమిది మంది కేంద్ర మంత్రులను, ప్రతిపక్ష పార్టీల నేతలను,ఓబీసీ పార్లమెంటు సభ్యులను కలిశామని,మేము కలిసిన 24 గంటల్లోనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు.
           ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం చాలా అభినందనీయమని, దీనిపై చొరవ తీసుకున్న  కేంద్ర మంత్రులకు, ముఖ్యంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దేశంలోని ఓబిసిల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని రాచాల తెలిపారు.
     2017 సంవత్సరం నుండి నేటి వరకు జాతీయ స్థాయి మెడికల్ అడ్మిషన్లలో ఓబిసి రిజర్వేషన్ లేకపోవడం మూలంగా ఇప్పటివరకు 11 వేల మంది  ఓబిసి విద్యార్థులు సీట్లు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
         అతి త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానిని కలుస్తామని, ఓబిసి రిజర్వేషన్లు పెట్టినట్టుగానే జనగణనలో బీసీ కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని, బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరుతామన్నారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనన్న ఆధ్వర్యంలో చేపట్టిన ఢిల్లీ పర్యటన విజయవంతమైందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా రాచాల కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భీమన్న నాయుడు,కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్,మదనాపూర్ కన్వీనర్ మహీందర్, అడ్డాకుల కన్వీనర్ శేఖర్ గౌడ్,బలిజ రమేష్, నక్క రాములు తదితరులు పాల్గొన్నారు.