ఇంటింటా ఇన్నోవేటర్ ఆన్ లైన్ చివరి తేదీ జులై 20,2021
- ఇంటింటా ఇన్నోవేటర్ ఆన్ లైన్ ఆవిష్కరణల ప్రదర్శనకు దరఖాస్తుల ఆహ్వానం చివరి తేదీ జులై 20,2021 జిల్లాలోని ఔత్సాహిక ఆవిష్కర్తలు వారి ఆవిష్కరణలను 9100678543 నంబర్ కు వాట్సాఅప్ ద్వారా పంపండి-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ కేంద్రం ద్వారా ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా నూతన ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిష్కర్తలు, పౌరులలో సృజనాత్మకతను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ఇన్నోవేషన్ కేంద్రం ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా స్థాయిలో ఆన్లైన్ ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి ప్రదర్శనలుంటాయని వెల్లడించారు. కరోనా నేపద్యంలో ఈ సంవత్సరం కూడా ఆన్లైన్లోనే ఇన్నోవేషన్స్ ఆవిష్కరణ ప్రదర్శన ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్లైన్లో నిర్వహించే ఈ ఆవిష్కరణల ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల మరియు వర్గాల వారు అర్హులని, ముఖ్యంగా గ్రామీణ ఆవిష్కరణలు, విద్యార్థులకు సంబంధించిన ఆవిష్కరణలు, ప్రారంభ ఆవిష్కరణలు,సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు అంగీకరించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆన్లైన్ ఆవిష్కరణల ప్రదర్శనలో పాల్గొనే ఆవిష్కర్తలు వారి ఆవిష్కరణకు సంబంధించిన అంశాలపై ఆరు వాక్యాల తో పాటు, రెండు నిమిషాల వీడియో, అదేవిధంగా ఆవిష్కరణ కు సంబంధించి నాలుగు ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు, తదితర వివరాలను 9100678543 నెంబర్ కు వాట్సాప్ చేయాలని తెలిపారు. ఆవిష్కర్తలు ఈ నెల 20లోగా వారి ఆవిష్కరణలను పై ఫోన్ నంబర్ కు వాట్స్ ఆప్ ద్వారా పంపించాలని తెలిపారు.వచ్చిన దరఖాస్తులలో నుండి ముందుగా మొదటి షార్ట్ లిస్ట్ తయారు చేసి తర్వాత ప్రతి జిల్లా నుండి ఐదు ఆవిష్కరణలను ప్రదర్శనకు ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని ఔత్సాహిక ఆవిష్కర్తలు ఈ ఆన్లైన్ ఆవిష్కరణల ప్రదర్శనలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కోరారు.