జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష
జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష ...దీక్షా దక్షులకు పూలమాలలు వేసిన డి సి సి అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్ మహబూబ్ నగర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్ ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ ఈ దీక్ష ద్వారా టి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయటం, హుజురాబాద్ లో ప్రవేశపెట్టిన దళిత బందు పథకం కేవలం ఒకే నియోజకవర్గం లో కాకుండా రాష్ట్రంలో ని అన్ని నియోజక వర్గాల్లో అమలు చేయాలి అని, కొన్ని కుటుంబాలకు కాకుండా మొత్తం దళిత కుటుంబాలకు అందించాలని అన్నారు. రాష్టం లో కె సి ఆర్ ప్రతి ఎలక్షన్ సమయంలో కొత్త పథకం ప్రవేశపెట్టడం ఎలక్షన్ తరువాత బందు చేయటం ఆయనకు అలవాటు అన్నారు.తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదం లోఉంది ఓట్లద్వారా కాకుండా నోట్ల ద్వారా ఎలక్షన్ జరుపుతున్నారు అని, తెలంగాణ రాష్ట్రం లో కె సి ఆర్ దుర్మార్గపు పాలన నుండి తెలంగాణ ప్రజలను విముక్తుల్ని చేయటం కోసం కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించి ప్రజల పక్షాన పనిచేయటం జరుగుతుంది అని అన్నారు.వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ పెద్ద బాధ్యత తీసుకుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పి.సి.సి కార్యదర్శి ఎన్.పి.వెంకటేష్,ఉపాధ్యక్షులు చంద్రకుమార్ గౌడ్, మహబూబ్ నగర్ అసెంబ్లీ ఇంచార్జి చంద్రశేఖర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ కన్వీనర్ సి.జె.బెనహర్, మహబూబ్ నగర్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాసు యాదవ్,దేవరకద్ర అసెంబ్లీ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్,ఉపాధ్యక్షులు నర్సింహ యాదవ్,ప్రధాన కార్యదర్శి ఫాసియోద్దీన్, ప్రధాన కార్యదర్శ కె బి ఆర్ గౌడ్, మోహన్ నాయక్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్,దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ యాదవ్ గ తదితరులు పాల్గొన్నారు.