జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయూ నిరంతర కృషీ

 జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయూ నిరంతర కృషీ

 
- అతి త్వరలో అక్రెడిటేషన్ కమిటీ సమావేశాలు
- నెలాఖరులోగా మహబూబ్ నగర్ జిల్లా మహాసభ 
- టీయూడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ వెల్లడి 
మహబూబ్ నగర్ నవంబర్ 2: గత ఆరు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుల పక్షాన నిలబడి, వారి సంక్షేమానికి నిరంతరంగా పాటుపడుతున్న ఏకైక యూనియన్ టీయూడబ్ల్యూజే(ఐజేయు) అని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్లో యూనియన్ జిల్లా నాయకులతో జిల్లా మహాసభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన అక్రెడిటిషన్లకు సంబంధించి అతి త్వరలోనే రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో జర్నలిస్టులకు ఒక అద్భుతమైన హెల్త్ పాలసీని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోనూ యూనియన్ లో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని, ఈ నెలాఖరులోపే జిల్లా మహాసభను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శిని యూనియన్ జిల్లా నాయకులు శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు మహబూబ్నగర్ జిల్లాకు విచ్చేసిన యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు మాజీద్ ను రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్ గౌడ్, సతీష్ రెడ్డి, వెంకట్ రమణ, శ్రీనివాస్ గౌడ్, కాటం నాగరాజుగౌడ్, గోకులం వెంకటేష్, విజయ్, నగేష్, హుస్సేన్, మిరాజ్, శివ తదితరులు పాల్గొన్నారు.నగేష్, హుస్సేన్, మిరాజ్, శివ తదితరులు పాల్గొన్నారు.